ఏప్రిల్ 14న విడుదల కానున్న ఆర్య 'గజేంద్రుడు'
- April 10, 2017
మూడు దశాబ్దాలుగా ఎన్నో కుటుంబ కథాచిత్రాలతో సూపర్ డూపర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆర్.బి.చౌదరి నిర్మాతగా ప్రోడక్షన్ 89 గా రూపొందిన చిత్రం `గజేంద్రుడు`. ఆర్య, క్యాథరిన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకుంది, చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదలచేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
నిర్మాత ఆర్.బి.చౌదరి గారు మాట్లాడుతూ..మా సూపర్‌గుడ్ ఫిలింస్ బ్యానర్లో వస్తున్నప్రోడక్షన్‌నెం 89వ సినిమా `గజేంద్రుడు`. ఈ చిత్రం ఆర్య కెరీర్లో టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంది. క్యాథరిన్ ఎంతో చక్కగా నటించింది. హీరో హీరోయిన్స్ ఇద్దరూ పాత్రకు తగ్గట్టుగా పరకాయ ప్రవేశం చేశారు. కథకి తగ్గట్టుగా వీరి బాడీ లాంగ్వేజ్ ని మార్చుకున్నారు. పిల్లల్ని బాగా అలరించే చిత్రంగా గజేంద్రుడు ఈ సమ్మర్ కి ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఫ్యామిలి అంతా వచ్చి చూసి ఎంజాయ్ చేసే చిత్రంగా మా గజేంద్రుడు వుంటుంది. యువన్‌శంకర్ రాజా మంచి సంగీతాన్ని అందించారు. డైరెక్టర్ రాఘవ ఎంతో హార్డ్ వర్క్ చేశారు. సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 14న విడుదలవుతుంది. నిర్మాత ఆర్.బి.చౌదరి తెలిపారు.
హీరో ఆర్య మాట్లాడుతూ.. నేను ఎప్పుడు కొత్త చిత్రం చేసినా ప్రేక్షకులు ఆదరించారు. మరో కొత్త చిత్రం ఈ గజేంద్రుడు. కంటెన్ట్‌బేస్‌డ్ సినిమాలను చేసే నిర్మాతల్లో ఆర్.బి.చౌదరిగారు నిర్మించారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా మొత్తం చేయాలంటే అంత సులభం కాదు. చౌదరిగారి సపోర్ట్ లేకుంటే ఈ సినిమా చేసేవాళ్ళం కాదు. క్యాథరిన్ ఎంతో సపోర్ట్ చేసింది. డైరెక్టర్ రాఘవ రెండో సినిమానే ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌తో చేశాడు. తన మంచి పట్టున్న దర్శకుడు తను భవిష్యత్‌లో తెలుగు, తమిళంలో పెద్ద దర్శకుడుగా ఎదుగుతాడు. ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. అని హీరో ఆర్య అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







