విశాఖలోని 7వేల మందితో కూచిపూడి నృత్య ప్రదర్శన
- April 11, 2017
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన 7వేల మంది బాలికలు సామూహిక కూచిపూడి నృత్య ప్రదర్శన చేపట్టారు. విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానం ఇందుకు వేదికైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 21 గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థినులు గిన్నిస్‌బుక్ రికార్డు కోసం ఈ ప్రదర్శన చేశారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూచిపూడి మన వారసత్వ సంపదని.. దాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కూచిపూడి అభివృద్ధికి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించామన్నారు. కూచిపూడి అకాడమీకి అమరావతిలో స్థలం కేటాయిస్తామన్నారు. అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







