హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కనున్న గోపీచంద్ సినిమా: సంపత్ నంది
- April 11, 2017
యాక్షన్ హీరోల్లో గోపీచంద్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే.. ఇటీవలి కాలంలో సరైన హిట్టు లేక సతమతమవుతున్న గోపీచంద్.. ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్లో గౌతమ్‌నంద అనే సినిమాలో నటిస్తున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్.. దక్షిణాదిలో ఏ హీరో చేయని రీతిలో హాలీవుడ్ స్టైల్ స్టంట్‌ను చేశాడట. ఈ విషయాన్ని సంపత్ నంది తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశాడు. ''దక్షిణాది సినిమాలోనే తొలిసారి. గౌతమ్ నందా సినిమాలో పూర్తి స్థాయి స్కై డైవింగ్ సీన్ షూటింగ్‌ను పూర్తి చేశాం. గోపీచంద్ గారి ధైర్యానికి హ్యాట్సాఫ్. సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే చెప్తాం. ఆయన అభిమానులకు ఈ సినిమా విందు భోజనమే'' అని ట్వీట్ చేసిన సంపత్.. ఆ షూట్‌కు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ స్టంట్ సీన్ హీరో ఇంట్రడక్షన్ పాటకు సంబంధించిందని టాక్. ప్రస్తుతం దుబాయ్‌లో గోపీచంద్ ఇంట్రడక్షన్ సాంగ్‌ను తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్.ఆ పాటకు రాజు సుందరం కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఈ చిత్రం చాలా దిగ్విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు ఏ.కె.యస్ గ్లోబల్ మీడియా & ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత అశ్వని కుమార్ సహదేవ్, ప్రొడక్షన్ మేనేజర్స్ దుబాయ్ దేవా, నిఖిల్ ఆశిస్తున్నారు.


తాజా వార్తలు
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







