ఫ్యామిలీస్ కోసం ఫెస్టివల్ విలేజ్ ప్యాకేజీలు
- April 11, 2017
కతర్:ఎజ్డాన్ వరల్డ్ కంపెనీ ఏప్రిల్ 30 వరకు, అమేజింగ్ ఆఫర్స్‌ని ఫ్యామిలీ ప్యాకేజీ రూపంలో ప్రకటించింది. మ్యాజికల్ ఫెస్టివల్ విలేజ్ సందర్శకులకు ఈ ఆఫర్ అత్యద్భుతమైనదని సంస్థ ప్రతినిథులు అంటున్నారు. గేమ్స్, సర్‌క్యూ డ్యూ రాయల్ షోస్, 357 కమర్షియల్ షాప్స్ అద్భుతమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. సర్‌క్యూ డు రాయల్ వేలాదిమంది విజిటర్స్‌ని ఇప్పటికే ఆకర్షించింది. ఆక్రోబాటిక్స్, ఫైర్ బ్రీతింగ్, వీల్ ఆఫ్ డెత్ వంటివి, లేజర్ మరియు బ్యాలెన్స్ గేమ్స్, హార్సెస్ టామింగ్ వంటి ఆకర్షణలూ ఇక్కడ సందర్శకుల్ని ఆకట్టుకుంటున్నాయి. సోమవారం నుంచి గురువారం వరకు రెండు షోస్ సర్కస్ ఇంకో ప్రధాన ఆకర్షణ. ఎజ్డాన్ వరల్డ్ జనరల్ మేనేజర్ అబ్దుల్ అజీజ్ అల్ మొహన్నది మాట్లాడుతూ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి మ్యాజికల్ ఫెస్టివల్ విలేజ్ పెర్‌ఫెక్ట్ డెస్టినేషన్ అని చెప్పారు. అత్యద్భుతమైన ప్యాకేజీలతోపాటు, ఉచిత ఎంట్రీని సందర్శకులకు కల్పిస్తున్నామని తెలిపారాయన. స్పేస్ ట్రిప్, రాయల్ హార్సెస్, గైరోస్కోప్స్, స్కై వ్యూ, 60 సీట్లు గల ట్రెయిన్, రోలర్ వీల్, 1,500 గేమ్ హాల్ సందర్శకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..







