పేలని బాంబుతో ఆటలు.. చిన్నారులు మృతి
- April 11, 2017
కాబూల్: పేలకుండా పడిపోయ ఉన్న మోర్టార్ రౌండ్‌తో ఆడుకుంటూ నలుగురు చిన్నారులు మృత్యువాతపడిన విషాదకర ఘటన ఆఫ్ఘనిస్థాన్‌లో చోటుచేసుకుంది. తాలిబన్ల ఆధీనంలో ఉన్న కుందుజ్ రాష్ట్రంలో కొందరు చిన్నారులు మోర్టార్ రౌండ్‌తో ఆడుకుంటుండగా అకస్మాత్తుగా అది పేలింది. దీంతో నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు చిన్నారులు గాయాలపాలయ్యారని పోలీసులు తెలిపారు. గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో యుద్ధాల కారణంగా ఎక్కడ పడితే అక్కడ పేలని బాంబులు, ప్రమాదకర వస్తువులు, మోర్టార్ రౌండ్స్ పడిపోయి ఉంటున్నాయి. అవి అకస్మాత్తుగా పేలడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి నెలా రోడ్ల పక్కన పడిన బాంబులు పేలి చనిపోయే, గాయాలపాలయ్యే వారి సంఖ్య దాదాపు 140 ఉంటుందని అంచనా.
తాజా వార్తలు
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!







