కారు ప్రమాదంలో జ్ఞాపకశక్తి కోల్పోయేన ఈ వ్యక్తిని గుర్తుపట్టండి
- April 12, 2017
అజ్మన్:ఇటీవల జరిగిన ఒక కారు ప్రమాదంలో జ్ఞాపకశక్తి కోల్పోయిన వ్యక్తి బాధాకరమైన పరిస్థితి ఇది. ఆయనను గుర్తించమని పోలీసులు బహిరంగంగా అభ్యర్థిస్తున్నారు.. ఓ నలభై ఏళ్ళ వయస్సు ఉన్న ఈ వ్యక్తి ఆసియా దేశాలకు చెందినవాడిగా భావిస్తున్నారు. ఆయన మెదడు నుండి తీవ్రమైన రక్తస్రావం వెలువడుతున్నకారణంగా నాలుగు శస్త్రచికిత్సలు జరిగేయి. దురదృష్టం ఏమిటంటే ఆయన తానూ ఎవరో మర్చిపోయారు..ఎంతకీ తానూ ఎవరో గుర్తుకు రాకపోవడం ఒక పెద్ద విషాదం ఈ గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ కోసం అజ్మన్ పోలీసులు ప్రయత్నించారు. కానీ వారు విఫలమయ్యారు. ఒక్క కుటుంబం సైతం తమ కుటుంబ సభ్యుడు ఒకరు తప్పిపోయినట్లు పిర్యాదు చేయకపోవడం ఈ కేసు పరిశోధనలో ఎటువంటి పురోగతి కనబడటం లేదు. ఆ వ్యక్తి ఎవరో కనుగొనేందుకు వెతుకుతున్నట్లు వివిధ పరిశోధనలు చేసినప్పటికీ మేము ఆయన ఎక్కడివారో గుర్తించలేకపోయామని పోలీసులు పేర్కొంటున్నారు.ఆయన చిరునామా, ఫోన్ నంబర్ లేదా తన గుర్తింపును నిరూపించే ఏ ఆధారాలు ఆయన వద్ద లేకపోవడంతో ఎంతో కష్టమవుతుందని సమగ్ర పోలీసు కేంద్రాలు డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఆలీ జాబెర్ అల్ శంసితెలిపారు. కారు ప్రమాదం తర్వాత ఆ వ్యక్తికి అజ్మన్ షేక్ ఖలీఫా ఆస్పత్రిలో చికిత్స జరిగినది. కారులో ఆయనకు సంబంధించిన ఏ వస్తువులు తన వెంట తీసుకురాకపోవడంతో ఆయనను గుర్తించడానికి అవకాశం లభించలేదని ఆ అధికారి పేర్కొన్నారు. ఈ సమాచారం తెల్సిన వారెవరైనా ఈ ఫోటోలోని వ్యక్తిని వారి కుటుంబ సభ్యులు ఎవరైనా గుర్తు పడితే, అజ్మన్ పోలీస్ ఆపరేషన్స్ శాఖ 06 740 9999 ఈ ఫోన్ నెంబర్ కు పిలవాలని డైరెక్టర్ కోరారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







