అమెరికాలో వీసా చిక్కులున్నా మనోళ్ళు బేఫికర్
- April 13, 2017
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం హెచ్ 1 బీ వీసా రూల్స్ ని కఠినతరం చేసినా ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు మాత్రం ఇబ్బందులేవీ లేవని అంటున్నారు యూఎస్ లోని టాప్ యూనివర్సిటీల ప్రెసిడెంట్లు. వీరికి ఇంకా డిమాండ్ ఉందని, వీసా నిబంధనలున్నా వీరి సేవలను యూనివర్సిటీలు కోరుకుంటున్నాయని భారత సంతతి సీఈవో ఒకరు తెలిపారు.
మిచిగాన్ లోని లారెన్స్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అయిన వీరేందర్ కె.మోడ్గిల్ ఇటీవల ఇండియా వచ్చిన సందర్భంగా ఈ విషయాన్నిచెబుతూ, తమ కోర్సులను ముగించుకున్న అనంతరం అమెరికాలో ఉద్యోగాలు కోరుకునే ఇక్కడి స్టూడెంట్స్ ఆందోళన చెందవలసిన పని లేదన్నారు.
టాలెంట్ గల విద్యార్థులకు అక్కడి విశ్వ విద్యాలయాలు ఎప్పుడూ ఆహ్వానం పలుకుతున్నాయని, ఇందుకు ఆయా సంస్థల ప్రెసిడెంట్లు హామీ ఇస్తున్నారని అయన చెప్పారు. వీసా రూల్స్ లో కొన్ని మార్పులు చేసినా ఇదివరకు మాదిరే ఈ స్టూడెంట్స్ కు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికన్ యూనివర్సిటీలు సేఫ్.. మల్టీ కల్చరిజాన్ని ప్రమోట్ చేయడానికి అవి ఆసక్తి చూపుతున్నాయి అని మోడ్గిల్ అన్నారు. పంజాబ్ లోని లూధియానాకు చెందిన ఓ విద్యార్థి గతంలో యూఎస్ వెళ్లి అక్కడే చదివి ఓ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అయ్యాడన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







