ఆసియా బిలియర్డ్స్ చాంప్ పంకజ్ ఆడ్వాణీ
- April 14, 2017
ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌ను భారత ఏస్ క్యూయిస్ట్ పంకజ్ ఆడ్వాణీ కైవసం చేసుకున్నాడు. శుక్రవారం ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్లో ఆడ్వాణీ 6-3లో సౌరవ్ కొఠారీపై విజయం సాధించాడు. తొలి సెషన్లో అద్భుత ఆటను ప్రదర్శించిన కొఠారీ 3-1 ఫ్రేములతో ఆధిక్యం సంపాదించాడు. అయితే బ్రేక్ తర్వాత శక్తియుక్తులను కూడదీసుకున్న పంకజ్.. అనూహ్యంగా చెలరేగాడు. 3-1తో వెనుకబడిన దశనుంచి ఊహించని రీతిలో పుంజుకుని వరుస ఫ్రేముల్లో నెగ్గాడు. ఆడ్వాణీకి ఇది ఆరో చాంపియన్‌షిప్. గ్రూప్ స్టేజ్‌లో కొఠారీపై 4-0తో నెగ్గిన పంకజ్.. ఫైనల్లో మాత్రం గట్టిపోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!







