మహిళను హత్య చేసిన వ్యక్తి అరెస్ట్
- April 15, 2017
షార్జా పోలీసులు శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. శ్రీలంకకు చెందిన ఓ మహిళను తన ఇంట్లోనే హత్య చేశాడు నిందితుడు. షార్జాలోని మేసెలూన్ ప్రాంంలో ఈ హత్య జరిగింది. నేరం జరిగిన ఎనిమిది గంటల్లోనే హంతకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య గురించిన సమాచారం అందుకోగానే టీమ్స్‌ని రంగంలోకి దించారు. ఫోరెన్సిక్ నిపుణులు, అంబులెన్స్, సిఐడి మరియు పెట్రోల్ డిపార్ట్మెంట్స్కి చెందిన పలువురు అధికారులు నేరం జరిగిన ప్రాంతానికి వెళ్ళారు. ఫింగర్ ప్రింట్స్ సహా పలు ఆధారాల్ని సేకరించిన తర్వాత అటాప్సీ నిమిత్తం ఫోరెన్సిక్ లేబరేటరీకి మృతదేహాన్ని తరలించారు. మహిళతో హంతకుడికి అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!







