సొర చేప పిట్టు
- April 15, 2017
కావలసిన పదార్థాలు: సొర చేపలు - 2, ఉల్లి ముక్కలు - 1 కప్పు, పచ్చిమిర్చి - 4, ఆవాలు, మినప్పప్పు - చెరొక స్పూను, జీలకర్ర - 1 టీస్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీస్పూన్లు, గరం మసాలా - 1 టీస్పూను, పసుపు - 1 టీస్పూను, ఉప్పు - తగినంత, కొత్తిమీర - 1 కట్ట, నూనె - 2 టే.స్పూన్లు
తయారీ విధానం: గిన్నెలో చేప ముక్కలు, ఉప్పు, పసుపు, చేపలు మునిగేటన్ని నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తర్వాత ముక్కల్ని చిదిమి పక్కనుంచాలి. కడాయిలో నూనె పోసి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి. పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలిపి చేప పొడి వేయాలి. బాగా కలిపి చిన్న మంట మీద 5 నిమిషాలు మగ్గనివ్వాలి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







