హీరో ప్రభాస్ హీరో రానాల బలప్రదర్శనకు షాక్ అయిన చండీఘర్
- April 15, 2017
చండీఘర్ యూనివర్సిటీ భారత దేశం లోని మంచి యూనివర్సిటీలలో ఒకటి గా పేరుగాంచింది .ఈ యూనివర్సిటీ లో విద్యార్ధులు మంచి చైతన్యం తో ఉంటారు .అటువంటి యూనివర్సిటీ లోని విద్యార్ధులు బాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుకుంటారు కాని తెలుగు సినిమా గురించి తెలుగు హీరోల గురించి పట్టించుకోరు.
అయితే ఇప్పడు అటువంటి ప్రాంతం లో కుడా ప్రభాస్ రానాల మ్యానియా హడావిడి చేస్తోంది . బాహుబలి 2 గురించి తెలుగులో కనీసం ఒక్క ఇంటర్యూ కూడా ఇవ్వని కండలవీరులు ప్రభాస్ రానాలు ఈ మూవీ బాలీవుడ్ వెర్షన్ గురించి హడావిడి చేస్తున్నారు.
ప్రస్తుతం వీరిద్దరూ ఉత్తరాది రాష్ట్రాలలో రోజుకొక ఊరు తిరుగుతూ తెగ ఇంటర్యూలు ఇస్తున్నారు. ఈ నేపధ్యం లో మొన్న చండీఘర్ లో ప్రభాస్ రానాలుసందడి చేశారు. అక్కడి యునివర్సిటీలో స్టూడెంట్లతో ఇంటరాక్ట్ అయ్యి బాహుబలి సినిమా గురించి ప్రస్తావించడమే కాకుండా బాహబలి 2లో ఎలా వీరిద్దరూ ఫైట్ చేసారో వివరిస్తూ వీళ్ళిద్దరూ నిజంగానే ఒక చిన్న ఫీట్ చేశారు.
ప్రభాస్ రానాలు తమ చేతులతో తమ హ్యాండ్ పవర్ చూపిస్తూ హడావిడి చేసారు. దీనితో వీరిద్దరి బలప్రదర్శనను ఎంకరేజ్ చేస్తూ అక్కడి జనాలు కూడా కొందరు ప్రభాస్ వైపు కొందరు రానా వైపునా చేరి నానా రచ్చ చేశారు అని వార్తలు వస్తున్నాయి.
ఏప్రియల్ 28న బాహుబలి 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్దమవు తున్న నేపధ్యంలో ఈ సినిమాను బాలీవుడ్ లో విపరీతం గా ప్రమోట్ చేస్తూ రాజమౌళి తన 1000 కోట్ల టార్గెట్ ను అందుకోవడానికి రకరకాల స్కెచ్ లు వేస్తున్నాడు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







