తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం వడగాలుల హెచ్చరిక
- April 16, 2017
తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 2 నుంచి 4 డిగ్రీలు అదనంగా పెరిగి అన్ని చోట్లా 42 డిగ్రీలను దాటే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం పలుప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశముందని కేంద్రం సంచాలకురాలు డాక్టర్ కె.నాగరత్న తెలిపారు. ఆదివారం పలుచోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో గాలిలో తేమ పూర్తిగా తగ్గి వేడి, ఉక్కపోతలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత పదేళ్లలో ఏప్రిల్ నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల స్థాయికి చేరువగా ఆదివారం నమోదవడం గమనార్హం. హైదరాబాద్‌లో అత్యధికంగా 2016 ఏప్రిల్ 14న 43 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదవగా దానికి చేరువగా ఆదివారం 42.4 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణంకన్నా 4 డిగ్రీలు అదనం. వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం సాధారణంకన్నా 4 డిగ్రీలు అదనంగా పెరిగితే వడగాలుల తీవ్రత ఎక్కువవుతుంది. ఆదివారం అత్యధికంగా ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో ఉష్ణోగత్ర 44.4 డిగ్రీలకు చేరింది. హైదరాబాద్‌లో గాలిలో తేమ సాధారణంగా 52 శాతముండాలి. కానీ అది 31 శాతానికి పడిపోవడంతో నగరవాసులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







