బహ్రెయినీలు, వలసదారుల మధ్య తీవ్ర ఘర్షణ
- April 18, 2017
మనామాం పలువురు బహ్రెయినీలు మరియు బంగ్లాదేశీయుల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకుంది. సనాద్‌లోని కన్‌స్ట్రక్షన్స్ అండ్ శానిటరీ టూల్స్ స్టోర్ వద్ద ఈ ఘర్షణ జరిగింది. కొన్ని టూల్స్‌కి సంబంధించిన ధరపై బంగ్లాదేశీ సేల్స్‌మెన్‌తో బంగ్లాదేశీ వినియోగదారుడు ఘర్షణ పడటంతో వివాదం ముదిరి తీవ్ర ఘర్షణగా మారింది. సేల్స్‌మెన్, ఓ స్క్రూ డ్రైవర్‌తో వినియోగదారుడ్ని బెదిరించాడు. అనంతరం. సేల్స్‌మెన్, వినియోగదారుడ్ని బయటకు తోసేసినట్లు సిసిటివిలో రికార్డ్ అయ్యింది. అనంతరం మరో వ్యక్తి షాప్ లోపలినుంచి వచ్చి, సేల్స్‌మెన్‌తో 20 నిమిషాల అనంతరం వాగ్యుద్ధానికి దిగాడు. ఆర్గ్యుమెంట్ కాస్తా గొడవగా మారిపోయింది. ఇరువర్గాలూ కొట్టుకున్నాయి. ఈ ఘర్షణలో రాళ్ళు విసురుకోవడం, కట్టెలతో కొట్టుకోవడం కూడా జరిగింది. పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలానికి వెళ్ళి ఇరువుర్నీ శాంతింపజేశారు. కొందరికి గాయాలు కాగా, వారికి వైద్య చికిత్స అందించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







