షాపింగ్ మాల్స్‌లో పెరుగుతున్న పిల్లల మిస్సింగ్ కేసులు
- April 18, 2017
షాపింగ్ మాల్స్, హైపర్ మార్కెట్స్ల్లో చిన్న పిల్లల మిస్సింగ్ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి కేసుల్ని డీల్ చేయడానికి కొత్త కొత్త మార్గాల్ని అన్వేషించాల్సి వస్తోంది. ప్రతిరోజూ షాపింగ్ మాల్స్‌లో మూడు నుంచి ఐదు వరకు మిస్సింగ్ కేసులు నమోదవుతున్నట్లు రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. కొన్ని షాపింగ్ మాల్స్, తమ సిబ్బందికి ఇలాంటి కేసుల్ని డీల్ చేయడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తున్నాయి. తప్పిపోయిన పిల్లల్ని కనుగొని, కస్టమర్ కేర్ డెస్క్ వద్ద వారిని ఉంచి, అనౌన్స్మెంట్ ఇవ్వడం వంటివి చేస్తున్నారు. మరికొన్ని మాల్స్ సిసిటివి ఫుటేజ్‌ల ఆధారంగా తప్పిపోయిన పిల్లల్ని తల్లిదండ్రులకు అప్పగిస్తున్నారు. క్వాలిటీ హైపర్ మార్కెట్ ఉద్యోగి ఒకరు పసి పిల్లల మిస్సింగ్‌పై మాట్లాడుతూ, తమ మాల్స్‌లో నిపుణులైన సహాయకుల్ని ఏర్పాటు చేస్తున్నామని, సిసిటివి ఫుటేజ్ ద్వారా కనుగొనడం, అలాగే అనౌన్స్మెంట్స్ ద్వారా తల్లిదండ్రుల్ని అలర్ట్ చేస్తున్నామని వివరించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







