జూన్ 23న మన ముందుకు రాబోతున్న `డిజె దువ్వాడ జగన్నాథమ్`
- April 22, 2017
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. తాత అల్లు రామలింగయ్య వారసత్వం పునికి పుచ్చుకున్న ఈ యంగ్ హీరో కామెడీ, యాక్షన్, డ్యాన్స్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. గత సంవత్సరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'సరైనోడు' చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. `రేసుగుర్రం`,`సన్నాఫ్ సత్యమూర్తి`, `సరైనోడు` వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్.
ఇక `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో, శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `డి.జె..దువ్వాడ జగన్నాథమ్`. ఈ చిత్రాన్ని జూన్ 23న విడుదల చేస్తున్నారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``ఆర్య, పరుగు వంటి సూపర్‌హిట్ చిత్రాలు తర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో చేస్తోన్న హ్యాట్రిక్ మూవీ `డిజె దువ్వాడ జగన్నాథమ్`. మా బ్యానర్లో రూపొందుతోన్న 25వ సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో బన్నిని సరికొత్త లుక్‌లో చూస్తారు. అల్రెడి విడుదలైన టీజర్‌కు హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది.
నేను, బన్ని, హరీష్ శంకర్, దేవిశ్రీప్రసాద్, ఇలా మా కాంబినేషన్లో మూవీ అనగానే సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందరి అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను మా డైరెక్టర్ హరీష్ శంకర్ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటుంది.
సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను జూన్ 23న గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నాం`` అన్నారు.
ఈ చిత్రానికి ఫైట్స్:రామ్-లక్ష్మణ్, సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్: రవీందర్, స్క్రీన్‌ప్లే: రమేష్ రెడ్డి, దీపక్ రాజ్ నిర్మాతలు: దిల్‌రాజు-శిరీష్, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







