మొబైల్ ఫోన్ తో విద్యార్థి తలపై కొట్టి ఉద్యోగం పోగొట్టుకొన్న ఉపాధ్యాయుని వైనం
- April 22, 2017
మనామ: రాజ్యంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు తలపై మొబైల్ ఫోన్ తో బలంగా మోదాడు. దాంతో ఆ విద్యార్థి తలకు సెంటీమీటర్ పొడవు మేర గాయం ఏర్పడింది. బాలుడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, ఐదవ తరగతి చదువుతున్న ఆ బాలుడు సోషల్ మీడియా వేదికలపై తనకు జరిగిన సంఘటన గురించి ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు, ఇది వైరల్ గా తక్షణమే మారింది. ఈ సంఘటన ఫలితంగా, ఒక అరబ్ జాతీయుడైన ఆ ఉపాధ్యాయుడిపై విద్య మంత్రిత్వశాఖ స్పందించి ఆ సంఘటనపై విచారణ జరిపించిన తర్వాత ఆ ఆరోపణ వాస్తవమని గుర్తించడంతో ఆ ఉపాధ్యాయుడిపై అధికారులు చర్యలు తీసుకొన్నారు. తన కోపం కారణంగా శాశ్వతంగా ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆన్లైన్లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం, ఈ సంఘటన మంగళవారం జరిగింది, బాలుడు మరియు అతని తోటి విద్యార్ధులు దోహార్ ఆరాడ్ పార్క్ మరియు ముహారక్లోని సహజ అభయారణ్యంలకు పాఠశాల విహారయాత్రకు వెళ్లారు.వీడియో ఫుటేజ్ లో చూపినట్లుగా ఆ బాలుడు తన తండ్రికి 'హాయ్' అని చెప్పినప్పుడు, గురువు ఆమోదించక మొబైల్ ఫోన్ తో తలపై కొట్టినట్లు ఆ బాలుడి సాక్ష్యం రికార్డ్ కాబడింది." నేనుఏద్వడం ప్రారంభించాను మరియు మరొక గురువు వచ్చి రక్తంతో ఉన్ననా తల మరియు ముఖం కడగడం జరిగిందని " ఆ బాలుడు పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







