2,800 దిర్హామ్‌లకు మహిళ అమ్మకం
- April 22, 2017
బంగ్లాదేశీ కార్మికుడొకరు, ఓ మహిళా మెయిడ్‌ని ఆమెకు చెందిన స్పాన్సర్ నుంచి తప్పించేందుకోసం కుట్ర పన్నిన కేసులో అరెస్టయ్యాడు. అలాగే, ఆమెతో వ్యభిచార కార్యకలాపాలను నిర్వహించేందుకు ప్రయత్నించినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. స్పాన్సరర్ నుంచి తప్పించిన తర్వాత బాధితురాల్ని ఓ ఫ్లాట్‌లో బంధించారు. మంచి ఉద్యోగం చూపిస్తానని చెప్పి తనను మోసగించారనీ, అతని ఫ్లాట్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరు మహిళలు వ్యభిచారులుగా ఉండటాన్ని తాను గుర్తించానని బాధితురాలు పోలీసు విచారణలో పేర్కొన్నారు. 2,800 దిర్హామ్‌లకు ఓ మహిళను విక్రయించేందుకు నిందితుడు ప్రయత్నిస్తుండగా తమకు సమాచారం అందడంతో, అతన్ని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. చాకచక్యంగా ఈ కేసులో వ్యవహరించామనీ, రెడ్ హ్యాండెడ్‌గా నిందుతడ్ని పట్టుకునేందుకుగాను టీమ్‌ని పంపించి, రికార్డెడ్‌గా సమాచారం రాబట్టామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







