దోహాలో థాయ్ టూరిజం రోడ్ షో
- April 22, 2017
టూరిజం అథారిటీ ఆఫ్ థాయిలాండ్ (టిఎటి) దుబాయ్ మరియు మిడిల్ ఈస్ట్ కార్యాలయం, ఖతార్ ఎయిర్ వేస్తో కలిసి దోహాలో రోడ్ షో నిర్వహించాయి. థాయిలాండ్ టూరిజంని ప్రమోట్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా థాయిలాండ్‌కి చెందిన ప్రైవేట్ సెక్టార్ అలాగే ఖతార్‌కి చెందిన ట్రావెల్ ట్రేడ్ అండ్ టూరిజం పార్టనర్స్ మధ్య సన్నిహిత సంబంధాల దిశగా కూడా చేపట్టారు. ఖతారీ నేషనల్స్ మరియు నివాసితులకు థాయిలాండ్ అత్యద్భుతమైన టూరిజం డెస్టినేషన్ అని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. థాయిలాండ్‌లోని పర్యాటక కేంద్రాల గురించి నిర్వాహకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. గత ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు మొత్తం 671,202 మంది టూరిస్టులకు మిడిల్ ఈస్ట్ నుంచి తాము ఆహ్వానం పలికినట్లు టిఎటి డైరెక్టర్ - దుబాయ్ అండ్ మిడిల్ ఈస్ట్ మార్కెట్ ఛాలెర్మసాక్ సురానాంత్ చెప్పారు. మిడిల్ ఈస్ట్ రీజియన్‌లో యూఏఈ, ఒమన్, కువైట్, బహ్రెయిన్, మరియు ఖతార& దేశాలు టూరిజం రంగంలో టాప్ 5 స్పెండింగ్ కంట్రీస్‌గా ఉన్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







