హిందీలోనూ పాస్‌పోర్టు దరఖాస్తులు చేసుకోవచ్చు
- April 23, 2017
ఇకపై హిందీ భాషలో కూడా పాస్‌పోర్టు దరఖాస్తులు చేసుకునే సదుపాయం కల్పించింది విదేశాంగ శాఖ. ఈ మేరకు అధికారిక భాషపై పార్లమెంటరీ కమిటీ సిఫార్సులను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదించిన నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆంగ్లంతో పాటు హిందీలోనూ దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని తీసుకొస్తున్నట్లు ఆ శాఖ పేర్కొంది.
అధికారిక భాష హిందీపై 2011లో పార్లమెంటరీ సంఘం తొమ్మిదో కమిటీపలు సిఫార్సులు చేసి నివేదిక రూపొందించింది. ఇటీవలే ఈ నివేదికను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని పాస్‌పోర్టు కార్యాలయాల్లో ద్విభాషా దరఖాస్తులను అందుబాటులోకి తీసుకురావాలని పార్లమెంటరీ కమిటీ సూచించింది. అంతేగాక, హిందీలో నింపిన దరఖాస్తును కూడా విదేశాంగ శాఖ ఆమోదించాలని పేర్కొంది. ఇక, పాస్‌పోర్టులపై కూడా హిందీలో పేర్లను రాయాలని కూడా కమిటీ ప్రతిపాదించింది. ఈ సిఫార్సులకు రాష్ట్రపతి ఇటీవలే ఆమోదముద్ర వేశారు.
ఈ మేరకు పాస్‌పోర్టు వెబ్‌సైట్ నుంచి హిందీ దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విదేశాంగ శాఖ తెలిపింది. నింపిన దరఖాస్తులను తిరిగి వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయాలని చెప్పింది. దరఖాస్తును ఆన్‌లైన్‌లో కాకుండా పాస్‌పోర్టు సేవాకేంద్రాల్లో ఇస్తే అనుమతించబోమని విదేశాంగశాఖ స్పష్టంచేసింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







