ప్రభాస్ తదుపరి సినిమా టైటిల్ ‘సాహో’
- April 23, 2017
‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. ‘బాహుబలి’ కోసం దాదాపు ఐదేళ్లు అన్ని ప్రాజెక్టులనూ పక్కన పెట్టేశాడు. ఎట్టకేలకు ‘బాహుబలి-2’ కూడా విడుదలకు సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటించబోయే తదుపరి చిత్రంపై అభిమానుల్లో ఎప్పటినుంచో ఆసక్తి కనబడుతోంది. ఆ సినిమాకు టైటిల్ ఏంటి? దర్శకుడు ఎవరు? అనే విషయాలపై ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో ప్రభాస్ తదుపరి చిత్రంపై నిర్మాతలు అధికారిక ప్రకటన చేశారు. సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రానికి ‘సాహో’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రాన్ని ఏక కాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందిస్తున్నామని, ఈ చిత్ర ఫస్ట్‌లుక్ టీజర్‌ను ప్రపంచ వ్యాప్తంగా ‘బాహుబలి-2’ చిత్రంతో పాటు ప్రదర్శించబోతున్నామని చెప్పారు. బాహుబలికి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన సాబు సిరిల్ ఈ సినిమాకు కూడా పనిచేస్తున్నారని నిర్మాతలు తెలిపారు. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా స్టైలిష్‌గా, ఓ కొత్త ఎనర్జీతో ప్రభాస్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడని, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నామని నిర్మాతలు పేర్కొన్నారు.
చిత్రం పేరు - సాహో
బ్యానర్ - యువి క్రియేషన్స్
కథా నాయకుడు - ప్రభాస్
దర్శకుడు - సుజిత్
నిర్మాతలు - వంశీ-ప్రమోద్
సంగీతం - శంకర్-ఎహసాన్-లాయ్
సినిమాటోగ్రాఫర్ - మధి
ఆర్ట్ డైరెక్టర్ - సాబు సిరిల్
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







