మోంటెకార్లోలో బోపన్నకు డబుల్స్ టైటిల్
- April 23, 2017
సింగిల్స్ విజేత రఫెల్ నడాల్
- మోంటెకార్లో మాస్టర్స్ టోర్నీ
న్యూఢిల్లీ : మోంటెకార్లోలో రోహన్ బోపన్న అదరగొట్టాడు. ఆదివారం నాటి ఫైనల్లో మెరుపు విజయం సాధించిన రోహన్ బోపన్న జోడీ పురుషుల డబుల్స్ టైటిల్ పట్టేసింది. ఉరుగ్వే భాగస్వామి పాబ్లొ కువాస్తో కలిసి బరిలోకి దిగిన భారత నెం.1 డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్న 6-3, 3-6, 10-4తో ఏడో సీడ్ స్పెయిన్ జోడీ ఫిలిసినో లోపెజ్, మార్క్ లొపెజ్లపై గెలుపొందారు. తొలి సెట్ ఆరంభంలోనే లొపెజ్ జంట సర్వ్ బ్రేక్ చేసిన బోపన్న జోడీ.. 3-1 ఆధిక్యంలోకి వెళ్లింది. అదే ఆధిక్యం కొనసాగించిన బోపన్న జంట 28 నిమిషాల్లోనే తొలి సెట్‌ను సొంతం చేసుకున్నది. ఇక రెండో సెట్లో పుంజుకున్న స్పెయిన్ ఆటగాళ్లు బోపన్న జోడీని వెనక్కి నెట్టారు. సర్వ్ కోల్పోయిన బోపన్న, పాబ్లొలు 1-3తో వెను కంజ వేశారు. 35 నిమి షాల పాటు హోరా హోరీగా సాగిన ఈ సెట్లో లోపెజ్ సోదరులు గెలు పొందారు. నిర్ణయా త్మక సూపర్ టైబ్రేకర్‌లో బోపన్న, పాబ్లొలు దుమ్మురేపారు.
వరుస పాయింట్లతో 6-0తో ముందంజ వేయటమే కాదు 11 నిమిషాల్లోనే టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో చెన్నై ఓపెన్ నెగ్గిన బోపన్నకు మోంటెకార్లో రెండో డబుల్స్ టైటిల్ కావటం విశేషం. ఇక పాబ్లొ జంటగా ఇదే తొలి టైటిల్ విజయం. పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్ 6-1, 6-3తో తొలి ఫైనలిస్ట్ ఆల్బర్ట్ రామోస్ వినొలస్ (స్పెయిన్)పై ఏకపక్ష విజయం నమోదు చేశాడు.
ఈ విజయంతో మోంటెకార్లోలో ఏకంగా పది ట్రోఫీలు సాధించిన ఏకైక ఆటగాడిగా నడాల్ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఇక్కడ తొమ్మిది సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన నడాల్.. తన దేశానికే చెందిన ఆటగాడిపై మెరుపు విజయంతో టెన్నిస్ చరిత్రలో మరే ప్లేయర్ సాధించన అరుదైన ఘనత దక్కించుకున్నాడు. నడాల్ మినహా మరే ఆటగాడు ఏ టోర్నీలోనూ పది టైటిల్ విజయాలు సాధించలేదు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







