అవతార్ సినిమా సీక్వెల్స్ రిలీజ్ డేట్స్ ప్రకటన
- April 24, 2017ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరున్ దర్శకత్వం వహించిన అవతార్ ను ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆదరించారు.. అవతార్ మేకింగ్ కు అత్యద్భుతం అంటూ ఆశ్చర్యం వక్తం చేసి.. అన్నీ ప్రాంతాలనుంచి కలెక్షన్ల వర్షం కురిపించారు.. అవతార్ ప్రేక్షకుల మనసులనే కాదు అవార్డ్స్ ను కూడా దక్కించుకొన్నది.. ఈ సినిమా సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ శుభవార్తను వినిపించారు. అవతార్ సినిమాకు సీక్వెల్స్ 2,3,4,5 భాగాలు .. వీటి రిలీజ్ డేట్స్ ను కూడా ఇప్పుడే ప్రకటించారు. అవతార్ 2 ను 2020 డిసెంబర్ 18 న , అవతార్ 3 ను డిసెంబర్ 17 2021 లో , అవతార్ 4 ను 2024 డిసెంబర్ 20న, అవతార్ 5 ను డిసెంబర్ 19 2025 లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ భాగాలన్నిటిని దాదాపు ఒకే సారి వర్క్ జరిగేలా ప్లాన్ చేసినందున ఇంత ఆలస్యంగా రిలీజ్ అవుతున్నాయని చెప్పారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







