మెట్రాష్ 2 ద్వారా ప్రమాదాలు నమోదు చేయాలని కోరిన ఆంతరంగిక మంత్రిత్వ శాఖ
- April 24, 2017
చిన్న రహదారి ప్రమాదాలను మెట్రాష్ 2 మొబైల్ అప్లికేషన్ ద్వారా నివేదించాలని వాహన సిబ్బందిని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ కోరింది. ఈ సేవలను ఆగస్టు 2016 లో ప్రారంభించినప్పటికీ, అవగాహన లేనందున కొంతమంది వాహనదారులు మాత్రమే ప్రయోజనం పొందారు. ఇ-సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగం అధిపతి ఆలీ అహ్మద్ అల్ బైనీ తెలిపారు. .2016 ఆగస్టులో మేము ఈ సేవను ప్రారంభించాము, ఈ సంవత్సరం ప్రారంభం వరకు, మేట్రాష్ 2 ద్వారా నమోదైన చిన్న ప్రమాదాల్లో 2,187 కేసులు మాత్రమే మా దృష్టికి వచ్చాయి. దేశంలో జరిగే చిన్న ప్రమాదాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది.వాస్తవంగా అన్ని రోడ్డు ప్రమాదాల్లో 90 శాతం చిన్న ప్రమాద సంఘటనలు ఉంటాయని ఆయన అన్నారు. .చిన్న ట్రాఫిక్ ప్రమాదాల్లో చిక్కుకొన్న వాహనదారులు కోసం ఆయా విధానాలను సులభతరం చేయడానికి ఈ సేవను ప్రారంభించడంజరిగిందన్నారు.చాలా మంది వాహనదారులకు మెట్రాష్ 2 ద్వారా చిన్న ప్రమాదాలు సైతం నమోదు చేయలేరని తెలియదు. అలాగే, సేవను ఎలా పొందాలనే విషయం సాకీతం అత్యధికులకు తెలియదు. అనేక వాహనదారులు, వారు చిన్న ప్రమాదాలు రిపోర్ట్ చేయాలనుకున్నప్పుడు, వాహనాల చిత్రాలను పంపాలని , ప్రమాదానికి సంబంధించిన చిత్రాలను పంపడం మర్చిపోతారు. ఫోటోలన్నీ తగినంత వివరాలను లేకపోవడం బట్టి ప్రమాద పరిశోధకులు కష్టపడతారని అలాగే మెట్రాష్ 2 గురించి మీడియాలోదీనిపై తగినంత ప్రచారం లేకపోవడంతో, వాహనదారులు దాని గురించి తెలియదు మరియు అదనంగా, దాని గురించి తెలిసిన వారికి కూడా ప్రమాదాలు నివేదించడానికి సరైన చర్యలు తీసుకోవని పోలీసు పత్రిక అల్ శర్తా మాక్ (మీతో పోలీస్) తో ఇచ్చిన ముఖాముఖిలో కార్యక్రమంలో కెప్టెన్ అల్ బైనీ తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







