తెలంగాణ ఫిల్మ్ చాంబర్ లో ఉచితంగా హెల్త్ కార్డులు
- April 25, 2017
తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) తృతీయ వార్షికోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ప్రతాని రామకృష్ణ గౌడ్, ఉపాధ్యక్షుడిగా జేవీఆర్, సెక్రటరీగా సాయి వెంకట్‌తో పాటు 23 మంది జనరల్ బాడీ మెంబర్స్‌ను ఎన్నుకుని, ప్రమాణస్వీకారం చేయించారు. అదే విధంగా తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా సీనియర్ నటి కవితను, సెక్రటరీగా జెవీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా 100 మంది సినీ, టీవీ నటీనటులు, కార్మికులకు ఐదు లక్షల బీమాతో కూడిన కేంద్ర ప్రభుత్వ హెల్త్ కార్డులు అందించారు. అనంతరం ప్రతాని మాట్లాడుతూ– ‘‘సినీ, టీవీ నటీనటులు, టెక్నీషియన్స్‌లో హెల్త్ కార్డుల కోసం తెలంగాణ ఫిల్మ్ చాంబర్‌లో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా హెల్త్ కార్డులు, చదువుకునే పిల్లలకు స్కాలర్‌షిప్స్ ఇప్పిస్తాం. సభ్యులందరికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి రెండు పడక గదుల ఇళ్లు ఇప్పించేందుకు కృషి చేస్తాం’’ అన్నారు.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







