గల్ఫ్ లో బాహుబలి ఫీవర్
- April 26, 2017
యావత్ సినీ ప్రేక్షక లోకంఆసక్తిగా ఎదురుచూస్తున్న దర్శకధీరుడి సృష్టి ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదల కాబోతోంది. దేశవ్యాప్తంగా అభిమానులు టిక్కెట్ల కోసం విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. మల్టీఫ్లెక్స్‌ల్లో ఇప్పటికే దాదాపు తొలి వారం టిక్కెట్లు అయిపోయాయని వార్తలు విన్పిస్తున్నాయి. ఈ బాహుబలి మానియా ఒక్క మన దేశానికి మాత్రమే పరిమితం కాలేదట! దుబాయిలో ఈ సినిమాను చూసేందుకు అక్కడి ప్రేక్షకులు ఆత్రుతగా ఉన్నారని డిస్ట్రిబ్యూటర్ మను తెలిపారు. కేవలం ప్రి బుకింగ్ ద్వారానే దాదాపు లక్ష టిక్కెట్లు అమ్ముడైనట్లు ట్రేడ్ అనలిస్ట్ గుల్షాన్ పేర్కొన్నారు. ఇది ఆల్‌టైమ్ రికార్డ్ అని ఆయన వెల్లడించారు. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8’ కంటే కూడా బాహుబలికే అధిక టిక్కెట్లు అమ్ముడయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ స్థాయి క్రేజ్‌తో బాహుబలి కచ్చితంగా ఆ సినిమా తొలి వారాంతపు వసూళ్లను సైతం అధిగమిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చిత్ర బృందం తమ ఆఖరి షెడ్యూల్ చిత్ర ప్రచార కార్యక్రమాలను దుబాయిలో నిర్వహించింది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







