పాల తాళికలు
- April 26, 2017
కావలసిన పదార్థాలు : బియ్యం పిండి-పెద్ద గ్లాసు, పాలు-ఒక లీటరు, నీళ్ళు-ఒక లీటరు, సగ్గుబియ్యం-అర కప్పు, మైదాపిండి-అర కప్పు, బెల్లం-అర కిలో, పంచదార-ఒక కప్పు, జీడిపప్పు, కిస్మిస్-50గ్రా, యాలకుల పొడి-ఒక టీస్పూన్, ఉప్పు-తగినంత.
తయారుచేసే విధానం : మందపాటి గిన్నె స్టవ్‌పై ఉంచి అందులో పాలు, నీళ్లు పోసి మరగనివ్వాలి. మరో గిన్నెలో బియ్యంపిండి, మైదాపిండి, ఒక స్పూను బెల్లం, కొంచెం ఉప్పు వేసి మరిగే పాలు కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. తర్వాత మరుగుతున్న పాలలో సగ్గుబియ్యం వేసి, చక్రాల గిద్దలతోగాని, పాలతాళికల మూకుడుతోగాని పిండిని వత్తాలి. ఆఖర్లో చక్రాల గిద్దల్లోగాని, మూకుడులోగాని మిగిలిన పిండిలో కాసినినీళ్లు పోసి బాగా కలిపి ఆ నీళ్లను కూడా దాంట్లోనే పోయాలి. బెల్లాన్ని మెత్తగా దంచి అందులో కప్పు పంచదార కలిపి, కప్పు నీల్లు పోసి తీగపాకం పట్టుకుని ఈ పాకాన్ని ఉడుకుతున్న పాల తాళికల గిన్నెలో పోసి యాలకుల పొడి వేయాలి. తినేటప్పుడు నేతిలో దోరగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్ పైన చల్లుకోవాలి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







