గోపీచంద్ 'గౌతమ్ నంద' హీరో.. విలన్ కూడా
- April 27, 2017యాక్షన్ హీరో గోపీచంద్ 'గౌతమ్ నంద'గా రాబోతున్న విషయం తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక, కేథరిన్ లు జతకట్టనున్నారు. ఇదో యాక్షన్ ఎంటర్ టైనర్. ఇందులో గోపీచంద్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. డబుల్ యాక్షన్ చేయడం గోపీచంద్ కి ఇదే తొలిసారి.
ఇప్పుడీ చిత్రం గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. గౌతమ్ నంద.. ఒకరు కాదు ఇద్దరన్న విషయం స్పష్టమైంది. అయితే, హీరో, విలన్ గా కూడా గోపీచంద్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో జయం, వర్షం, నిజం.. సినిమాల్లో విలన్ గా కనిపించాడు గోపీచంద్. గోపీని హీరో కంటే విలన్ గా చూసేందుకు ఇష్టపడే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు 'గౌతమ్ నంద' ఆ కోరిక తీర్చబోతున్నాడు గోపీ.
వచ్చే నెలలో 'గౌతమ్ నంద'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్. ఎస్. థమన్.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







