రామ్ గోపాల్ వర్మపై నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ
- April 28, 2017
స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2009 లో వర్మ ‘అగ్యాత్’ అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. కానీ ఆ సినిమా కథ తనదంటూ రచయిత సిద్ధిక్ ముస్తాక్ ముహసిన్ అప్పట్లో కోర్టులో కేసు వేశాడు. తాను ఒక కథను తయారు చేసి వర్మకు పోస్ట్ చేశానని కానీ వర్మ నుండి తనకు ఎలాంటి సమాధానం రాలేదని, తీరా 2009లో ఆయన చేసిన ‘అగ్యాత్’ సినిమా చూస్తే అది తన కథేనని అర్థమయిందని అన్నాడు. కానీ సినిమా టైటిల్స్ లో తన పేరు ఎక్కడా కనబడలేదని, ఆ కథను తాను ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ కూడా చేయించానని అంటూ అప్పుడే కోర్టులో కేసు వేశాడు. ఆ కేసును విచారణనకు స్వీకరించిన న్యాయస్థానం గత రెండేళ్లలో పలు సార్లు వివరణ ఇవ్వాలని వర్మకు సమన్లు పంపింది. కానీ వర్మ వాటిపై స్పందించకపోవడంతో కోర్టు ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది
తాజా వార్తలు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం







