'గల్ఫ్' సినిమాకు వినోదపు పన్ను రద్దుకు కృషి
- April 28, 2017
“గల్ఫ్” సినిమాకు వినోదపు పన్ను రద్దు చేసేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంను తన వంతు బాధ్యతగా కోరుతానని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జగిత్యాల ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలనుంచి జీవనోపాధి కోసం వెళ్ళి, కుటుంబాలకు దూరం అవుతూ, వారు పడే ఇబ్బందులను వివరిస్తూ, గల్ఫ్ వలసలు ఆగిపోవాలన్న ఇతివృత్తంతో శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన *గల్ఫ్* సినిమా బృందం ఆధ్వర్యంలో శుక్రవారం గల్ఫ్ అమరుల దినం కార్యక్రమం జగిత్యాల లో జరిగింది.
ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో పాటుగా సినిమా దర్శకులు పి.సునీల్ రెడ్డి, అరుణ హాస్పిటల్ వైద్యులు, సామాజిక వేత్త ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి, సినిమా హీరో పవన్, హీరోయిన్ డింపుల్, కార్యక్రమం కన్వీనర్లు మంద భీంరెడ్డి, కడార్ల రంజిత్ కుమార్ పాల్గొని, గల్ఫ్ అమరులకు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ…జీవనోపాధికోసం ఉన్న ఊరు..కన్న తల్లితండ్రులు, భార్యాపిల్లలను వదిలి నానా కష్టాలు పడుతున్న గల్ఫ్ వలస జీవుల జీవన స్థితి గతులకు అద్దంపడుతూ, వలసలు ఆపాలన్న ఉద్దేశ్యంతో తీసిన సినిమా గల్ప్ వెతలు కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినోదం పన్ను మినహాయించేలా కృషి చేస్తానన్నారు.గల్ఫ్ లో దుర్మరణం చెందిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గల్ప్ లో మృతి చెందినవారి కుటుంబాలకు ప్రభుత్వం కనీసం రూ.3 లక్షల మృత ధన సహాయం అందించి ఆదుకోవాలని డా.శ్రీనివాస్ రెడ్డి, భీంరెడ్డి , తదితరులు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్‌తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







