రామ్ కార్తిక్ నటించిన 'అక్కడొకడున్నాడు' షూటింగ్ ప్రారంభం
- April 30, 2017
లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై శివ శంకర రావు కంటగమనేని, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'అక్కడొక్కడున్నాడు'. రామ్ కార్తిక్, దీపిక హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నా ఈ సినిమా ఆదివారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి లహరి ఎస్టేట్స్ అధినేత హరిబాబు క్లాప్ నివ్వగా, రవీంద‌్రరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత సి. కల్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలలో ఒకరైన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, 'కథ కొత్తగా ఉంటుంది. కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యా. అందుకే సినిమా నిర్మాణానికి పూనుకున్నా. ప్రతీ పాత్ర ఆద్యంత ఆసక్తికరంగా ఉంటుంది. సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేస్తాం. మిగతా పనులు కూడా పూర్తిచేసి వీలైనంత త్వరగా సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని అన్నారు.
మరో నిర్మాత శివశంకరరావు మాట్లాడుతూ, 'గతంలో కొన్ని సినిమాల్లో నటించాను. కానీ మళ్లీ వ్యాపార రంగంలో బిజీ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అక్కడొకడున్నాడు సినిమా తో రీ ఎంట్రీ ఇస్తున్నా. ఇందులో ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నా. పాత్ర చాలా వైవిథ్యంగా ఉంటుంది. తెలుగు లో ఇప్పటివరకూ ఇలాంటి కాన్సెప్ట్తో ఎవ్వరు సినిమా చేయలేదు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుంద'న్నారు.
చిత్ర దర్శకుడు శ్రీపాడ విశ్వక్ మాట్లాడుతూ, 'పొరపాటుకు- తప్పుకు మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. ప్రేమ అంటే అందాన్ని ఆకర్షించడం కాదు. వ్యక్తిత్వాన్ని ఆరాధించడం. ఇద్దరు ప్రేమికులు అనుకోకుండా విపత్కర పరిస్థితులకు లోనైతే స్వచ్ఛమైన ప్రేమ వారిని ఎలా కాపాడుతుందనే పాయింట్ పొరపాటు- తప్పుగా డివైడ్ చేసి చూపిస్తున్నాం. ప్రతీ పాత్రలో చక్కని ఎమోషన్ ఉంటుంది. ఆ భావోద్వేగాలను కన్వెన్సింగ్గా చెబుతున్నా. టెక్నికల్గాను సినిమా హైలైట్ గా ఉంటుంది. మే 2 నుంచి 20 వరకూ కంటున్యూస్గా షూటింగ్ చేస్తామ'న్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్‌తో బస్‌పాస్‌లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









