పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'మే డే' శుభాకాంక్షలు
- April 30, 2017
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మేడేను పురస్కరించుకుని ప్రకటన విడుదల చేసారు. కుల, మత, జాతి, ప్రాంతీయ భేదాలు మరచి ప్రపంచం మొత్తం జరుపుకునే ఏకైక వేడుక మే డే ఆయన పేర్కొన్నారు.
ప్రతి ఇంట్లో నిత్యం శ్రమించే అమ్మ నుంచి సరిహద్దులో అహర్నిశలు దేశ రక్షణకు కాపలాకాసే సైనికుడి వరకు అంతా జరుపుకునే పండుగే మేడే అని ఆయన చెప్పుకొచ్చారు. మేడే అంటే శ్రమ శక్తికి తిరుగులేదని చాటే ఘనమైన రోజు అన్నారు.
ప్రతినిత్యం కష్టపడి పనిచేసే ప్రతిఒక్కరూ సంతోషంగా జీవించాలని, వారి జీవితాలు మరింత సుఖమయం కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ప్రపంచంలోని శ్రామికులందరికి నా తరపున, జనసేన శ్రేణుల తరపున మే డే శుభాకాంక్షలు-జైహింద్' అని ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







