ప్రపంచంలో చాక్లెట్ వినియోగంలో భారత్ ముందంజ
- April 30, 2017
ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న చాక్లెట్ మార్కెట్లలో భారత్ ముందంజలో ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాల్లో 13శాతం వృద్ధి నమోదు చేసిందని ఒక పరిశోధనలో వెల్లడైంది. లండన్‌కు చెందిన అంతర్జాతీయ సంస్థ మింటెల్ ఈ పరిశోధన నిర్వహించింది. మిగతా దేశాల్లో వీటి అమ్మకాలు స్తంభించిపోయాయని, 2016లో భారతీయులు 2,28,000 టన్నుల వినియోగించినట్లు పేర్కొంది. 2016లో ఆస్ట్రేలియా 95,000, ఇండోనేషియా 94,000 టన్నుల చాక్లెట్‌ను వినియోగించాయి. గతేడాదితో పోలిస్తే భారత్(13శాతం), పొలాండ్(2శాతం) మాత్రమే అంతర్జాతీయంగా అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేశాయి. 43శాతం మంది భారతీయులు చక్కెరతో తయారు చేసిన స్నాక్స్.. చాక్లెట్, కేక్‌లను మధ్యాహ్న భోజనం- రాత్రి భోజనం మధ్యలో తీసుకుంటున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







