హత్య కేసులో వ్యక్తికి జైలు శిక్ష
- May 01, 2017
బంగ్లాదేశీ వ్యక్తి ఒకరు, ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో ఐదేళ్ళ జైలు శిక్షకు గురయ్యాడు. గత ఏడాది నవంబర్ 22న ఈ హత్య జరిగింది. అల్ రషిదియాలోని ఓ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో చోటు చేసుకుందీ హత్య. చిన్న గొడవ ముదిరి పెద్ద గొడవగా మారడంతో, ఓ కార్మికుడు ఇంకో కార్మికుడ్ని కత్తితో పొడిచాడు. కొస ప్రాణంలో కొట్టుమిట్టాడుతున్న బాధితుడ్ని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడ్ని పట్టుకున్నామనీ, అయితే పనికి సంబంధించిన చిన్న గొడవ వల్ల అనుకోకుండా ఆవేశానికి గురై దాడి చేశాననీ, ఇది కావాలని చేసిన హత్య కాదని నిందితుడు పేర్కొన్నాడు. హత్య జరగడానికి కాస్సేపటి ముందు ఇద్దరూ గొడవపడ్డారనీ, నిందితుడి చేతిలో ఐరన్ రాడ్, బాధితుడి చేతిలో కర్ర ఉన్నాయనీ, కొట్లాడుకుంటుండగా ఇద్దర్నీ వేరు చేసి, సముదాయించడం జరిగిందనీ, అయితే ఆ తర్వాత కాస్సేపటికి ఈ ఘటన జరిగిందని, నిందితుడు బాధితుడి ఛాతీలో పొడిచాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







