భారత జవాన్లను నరికి చంపిన పాక్ ఆర్మీ
- May 01, 2017
నియంత్రణ రేఖ వద్ద భారత జవాన్లపై దాడికి తెగబడిన పాక్ సైన్యం తీవ్రమైన దుశ్చర్యకు పాల్పడింది. సోమవారం ఫూంచ్ సెక్టార్‌లోని బీఎస్ఎఫ్ సైనిక స్థావరంపై గ్రనేడ్ రాకెట్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్ల మృతదేహాలను పాక్ ఆర్మీ అతికిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికేసింది. పాక్ దుశ్చర్యను భారత ఆర్మీ తీవ్రంగా ఖండించింది. దీనిపై పాక్ తగిన సమాధానం చెప్పాలని, ఈ ఘటనకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుందని భారత ఆర్మీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. పాక్ దుశ్చర్యను తుచ్ఛమైన చర్యగా పేర్కొంది. ఈ దాడిలో జేసీవో నయీబ్ సుబేదార్ పరంజీత్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్ అమరులయ్యారు. జవాన్లపై పాక్ దాడి విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు. ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి జమ్ముకశ్మీర్‌లోని పరిస్థితుల గురించి ఆరా తీశారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







