కూలిన విమానం, ముగ్గురి మృతి
- May 01, 2017
స్పెయిన్‌లో చిన్నపాటి విమానం కూలిన దుర్ఘటనలో జర్మనీ దేశానికి చెందిన ముగ్గురు మరణించారు. శనివారం ముచమీల్ పట్టణం నుంచి గ్రెనడాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు చెప్పారు. గ్రెనడాకు 80 కిలో మీటర్ల దూరంలో పర్వత ప్రాంతంలో విమానం కూలినట్టు తెలిపారు.
మృతులను జర్మనీ వాసులుగా గుర్తించామని, ఆ దేశ కాన్సులేట్ కార్యాలయంతో సంప్రదిస్తున్నట్టు అధికారులు చెప్పారు. మరణించినవారు స్పెయిన్‌లో నివసించేవారా లేక టూరిస్టులా అన్న విషయం తెలియరాలేదని చెప్పారు. విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







