నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సోదరి
- May 01, 2017
భారత తొలి ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సోదరి, సంగీత దర్శకురాలు ఏఆర్ రెహానా యోగి అండ్ పార్టనర్స్ బ్యానర్‌పై నిర్మించి, సంగీతం సమకూర్చిన చిత్రం 'ఏన్‌డా తలైల ఎన్నై వెక్కల'. కొత్త దర్శకుడు విఘ్నేష్ కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కొత్త నటుడు అజార్, సంచితాశెట్టి హీరోహీరోయిన్లు. హాస్యనటుడు యోగిబాబు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఆడియోను ప్రముఖ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ చేతుల మీదుగా విడుదల చేయగా, తొలి సీడీని యువ సంగీత దర్శకుడు హిప్‌హాప్ ఆది అందుకున్నాడు. ఈ సందర్భంగా రెహానా మాట్లాడుతూ.. 'ఈ వేసవి కాలంలో తరచుగా వినిపించేమాట ఏనడా తలైల ఎన్నై వెక్కల అని. అందరూ తలకి నూనె పెట్టుకోండి, ఒంటికి మంచిది చెబు తారు. ఈ సినిమా కూడా అలాంటిదే. ఈ సమ్మర్‌లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చక్కని ఉపశమ నాన్ని కలిగిస్తుంది' అని నవ్వుతూ చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత జీకే రెడ్డి, డ్యాన్స మాస్టర్ కళా, సింగపూర్ దీపర్, ఎడిటర్ సీఎస్ ప్రేమ్, హీరో అజార్, హీరోయిన్ సంచితాశెట్టి, సినిమాటోగ్రాఫర్ వంశీ దరన్, నటుడు జయరామ్ సతీమణి పార్వతి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







