ఢిల్లీ లో కె.విశ్వనాథ్‌కు మరో గౌరవం
- May 01, 2017
కళాతపస్వి, దర్శకరుషి కె.విశ్వనాథ్‌కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా బుధవారం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం వేదికపై ఆయన ప్రసంగిస్తారు. 1969లో ఈ అవార్డు ఇవ్వడం మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ ఏ పురస్కార గ్రహీతకూ ఈ అవకాశం దక్కలేదు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు చొరవతో విశ్వనాథ్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఐదు పదుల ఏళ్లనాటి సినీ ప్రస్థానం, తెలుగు సినీ పరిశ్రమకు చేసిన కృషిపై ఆయన మాట్లాడనున్నారు. ‘దాదాసాహెబ్ పురస్కార తొలి స్వీకర్త దేవికా రాణి మొదలుకొని మనోజ్ కుమార్ వరకు ఎవరూ వేదికపై ప్రసంగించలేదు. తొలిసారిగా ఈ అవకాశం విశ్వనాథ్‌కు దక్కబోతోంది’అని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







