అల్లు అర్జున్ తో సినిమా తీయనున్న రాజమౌళి
- May 02, 2017
ఐదేళ్లపాటు బాహుబలి సినిమాతో కుస్తీపట్టి రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఫ్యామస్ అయిపోయాడు దర్శకుడు రాజమౌళి. బాహుబలి క్రతువు దిగ్విజయంగా పూర్తి కావడంతో రాజమౌళి తర్వాతి సినిమా ఏంటన్నది అందిరి మదిలోనూ మెదులుతోన్న ప్రశ్న. మహాభారతం అత్యద్భుతంగా తెరకెక్కించాలన్నది తన డ్రీమ్ అని చెప్పిన రాజమౌళి.. ఆ ప్రాజక్ట్ చేపట్టేందుకు సమయం ఉందంటున్నాడు. ఎటూ.. మహాభారతాన్ని వెయ్యికోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆల్రెడీ సెట్స్ మీదకు తెచ్చేందుకు ఓ ఎన్నారై రంగం సిద్దం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించబోతున్నాడు.
దీంతో ఇక రాజమౌళి చేసే తర్వాతి సినిమా బన్నీతో ఉంటుందన్నది ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. హరీష్ శంకర్ డైరెక్షన్లో 'దువ్వాడ జగన్నాథం'గా మంత్రాలు పఠిస్తున్న అల్లు అర్జున్.. ఈ సినిమా పూర్తైన వెంటనే రాజమౌళితో సినిమా చేస్తాడన్నది ఆ వార్తల సారాంశం. 'బాహుబలి' కి ముందు.. డివివి దానయ్య నిర్మాణంలో రాజమౌళి ఓ సినిమా తీయాలనుకున్నాడు. అయితే అది పట్టాలెక్క లేదు... అప్పట్లో ఈ చిత్రానికి అడ్వాన్స్ కూడా పుచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు అదే స్క్రిప్ట్ ని బన్నీ హీరోగా తెరెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







