'బాహుబలి-2' కి ప్రశంసలు సరిపోవు: సూర్య
- May 02, 2017
"బాహుబలి 2" చిత్రంపై తమిళ నటుడు సూర్య తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ చిత్రాన్ని చూసిన ఆయన తన స్పందనను తెలియజేస్తూ... "ఈ చిత్రం ఓ చక్కటి అనుభూతినిచ్చింది. ఈ చిత్రాన్ని అసలు ఏ విధంగా ప్రశంసించినా సరిపోదు. రాజమౌళి సర్ మన చిత్ర పరిశ్రమకు చక్కటి స్ఫూర్తినిచ్చారు. అదిరిపోయింది! హ్యాట్సాఫ్... బాహుబలి 2" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన రాజమౌళి కూడా సూర్యకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలావుండగా, సినీనటుడు ప్రభాస్ అభిమానులకు కొన్ని నెలల క్రితం మేడమ్ టుస్సాడ్స్ బిగ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో త్వరలోనే ప్రభాస్ విగ్రహం చూడొచ్చని అప్పట్లో టుస్సాడ్స్ ప్రకటించింది. అందుకోసం హైదరాబాద్‌లో ప్రభాస్ ఫొటోలు, కొలతలు కూడా తీసుకున్నారు.
అయితే, ప్రభాస్ మామూలుగా బయట కనిపించేటట్లు కాకుండా బాహుబలి సినిమాలో ప్రభాస్ ఎలా కనిపించాడో అలా ఈ విగ్రహాన్ని రూపొందించారు. ప్రభాస్ 'బాహుబలి' గెటప్‌లో అక్కడే ఉన్నారా? అనేలా చాలా చక్కగా ఆయన విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అంతేకాదు 'బాహుబలి: ది బిగినింగ్' క్లైమాక్స్‌లోని ఓ సన్నివేశాన్ని తలపించేలా విగ్రహం పరిసరాల్ని డిజైన్ చేశారు. ఈ మ్యూజియంలో చోటు సంపాదించుకున్న ఘనతను సొంతం చేసుకున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ స్టార్‌గా ప్రభాస్ కీర్తికెక్కాడు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







