డ్రగ్స్ విక్రయిస్తున్న షెపర్డ్‌కి జీవిత ఖైదు
- May 03, 2017
షీప్ ఫామ్‌లో డ్రగ్స్‌ని దాచి, వాటిని విక్రయిస్తున్న షెపర్డ్‌కి జీవిత ఖైదు పడింది. అబుదాబీ న్యాయస్థానం, ఆసియాకి చెందిన ఈ వ్యక్తిని దోషిగా నిర్ధారించి, శిక్షను ఖరారు చేయడం జరిగింది. అబుదాబీ సిటీ శివార్లలోని ఓ షీప్‌ఫామ్‌లో నిందితుడు షెపర్డ్‌గా పనిచేస్తున్నాడు. పెద్ద మొత్తంలో హెరాయిన్ క్యాప్సూల్స్‌ని నిందితుడు పాతిపెట్టి, భద్రపరిచినట్లుగా విచారణలో గుర్తించారు పోలీసులు. నిందితుడికి సంబంధించిన సమాచారం అందుకున్న యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్, వ్యూహాత్మకంగా విచారణ బృందాల్ని రంగంలోకి దింపింది. నిందితుడి అనుపానుల్ని జాగ్రత్తగా గుర్తించి, రెడ్ హ్యాండెడ్‌గా అతన్ని పట్టుకున్నారు విచారణ అధికారులు. యూఏఈ వెలుపల ఉన్న కొందరు డీలర్స్ నుంచి తాను డ్రగ్స్ సేకరించి, యూఏఈలో విక్రయిస్తున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించడంతో న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







