జులేఖా హాస్పిటల్ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్
- May 03, 2017
'సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మాసం' సందర్భంగా జులేఖా హాస్పిటల్, ఛాన్స్ టు ఛేంజ్ అనే క్యాంపెయిన్ని ప్రారంభించింది. సర్వైకల్ క్యాన్సర్ పట్ల అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం. ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని దివంగత అమీరా బిన్ కరమ్ (ఫార్మర్ ఛెయిర్ విమెన్ షార్జ బిజినెస్ విమెన్ కౌన్సిల్ మరియు ఫ్రెండ్స్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ (ఎఫ్‌ఓసిపి)కి డెడికేట్ చేశారు. దుబాయ్‌లోని డబ్ల్యు హోటల్లో ఈ క్యాంపెయిన్ని ప్రారంభించడం జరిగింది. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా తలెత్తే సమస్యలు, దాని నివారణ వంటి అంశాలపై పలువురు వక్తలు తమ విలువైన ప్రసంగాల ద్వారా చైతన్యం పెంచేందుకు ప్రయత్నించారు. డిబీపార్ట్మెంట్ ఆఫ్ మెడిసన్ (హెమటాలజీ, అంకాలజీ) డాక్టర్ పమేలా మున్స్టర్ (యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా) కీనోట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. హాస్పిటల్ అలాగే పేషెంట్ మధ్య సరైన అవగాహన వుంటే క్యాన్సర్‌ని జయించడం తేలికేనని ఆమె వివరించారు. జులేఖా హాస్పిటల్లో 475 మంది మహిళల ఉచిత కన్సల్టేషన్, అలాగే పాప్ టెస్ట్‌లు 2015లో చేయించుకోగా, 2016లో ఈ సంఖ్య 1,400కి చేరుకుంది. క్యాన్సర్ పట్ల అవగాహన, చైతన్యం పెరుగుతుండడం ఆహ్వానించదగ్గ విషయమని పేర్కొంటూ, ముందు ముందు ఇంకా అవగాహన, చైతన్యం పెరగాల్సి ఉందని మరికొందరు ప్రముఖులు చెప్పారు. 2016లో జులేఖా హాస్పిటల్ చేపట్టిన క్యాంపెయిన్ ద్వారా 1,400 మంది మహిళలు లబ్ది పొందారు. ఉచిత గైనకాలజీ సేవలు, పాప్ టెస్ట్‌లు, హెచ్పివి వ్యాక్సిన్లను షార్జా, దుబాయ్‌లలో మహిళలు పొందారు. ఫ్రెండ్స్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్, సైటోమెడ్, ఎయిర్ అరేబియా, ముసాఫిర్ డాట్ కామ్, 106.2 బిగ్ ఎఫ్ఎం వంటి సంస్థల సహకారం ఈ క్యాంపెయిన్‌కి లభించింది.

తాజా వార్తలు
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!







