సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాధ్ కు ఫాల్కే అవార్డు ప్రదానం
- May 03, 2017
ప్రసిద్ధ తెలుగు సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాధ్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరించారు. దేశ రాజధాని ఢిల్లీలోని జరిగిన 64వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా విశ్వనాథ్ ఈ అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు’ అంటూ త్యాగరాజ స్వామి కీర్తనను స్మరించుకున్నారు. తన తల్లిదండ్రులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. ఇదే కార్యక్రమంలో భాగంగా పెళ్లిచూపులు చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్, నిర్మాత దిల్ రాజు, డాన్స్ డైరెక్టర్ రాజు సుందరం, ఉత్తమ నటీనటులుగా ఎంపికైన అక్షయ కుమార్, సోనంకపూర్ కూడా అవార్డు తీసుకున్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







