మెగా అభిమాని క్రియేట్ చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫస్ట్ లుక్
- May 04, 2017
మెగా అభిమానులు అంతా చిరంజీవి 151వ సినిమా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' గురించి ఎంత ఆ శక్తిగా ఎదురు చూస్తున్నారు అన్న విషయానికి సంబంధించి ఒక ఆశ్చర్యకర విషయం ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ప్రారంభోత్సవం కూడ ఇంకా జరగకపోయినా ఈమూవీ ఊహాజనితమైన ఫస్ట్ లుక్ ను ఒక మెగా అభిమాని డిజైన్ చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ ఫస్ట్ లుక్ న్యూస్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
ఈసినిమాకు సంబంధించి ఇంకా స్క్రిప్ట్ పూర్తిగా ఫైనల్ కాలేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈ మూవీలో చిరంజీవి లుక్ ఎలా ఉండాలి అన్న విషయమై చాల లోతైన చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆ విషయాలు ఏమి పట్టించుకోకుండా ఒక వీరాభిమాని డిజైన్ చేసిన 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ఫస్ట్ లుక్ ను చూస్తే ఆ అభిమాని ఈ ఫస్ట్ లుక్ ను డిజైన్ చేయడానికి ఎంత కష్టపడ్డాడో అర్ధం అవుతుంది.
ఒక విధంగా ఇలాంటి వీరాభిమానులు ఉండడం బట్టే చిరంజీవి 9 సంవత్సరాల తరువాత తిరిగి హీరోగా నటించినా 'ఖైదీ నెంబర్ 150' కి అటువంటి షాకింగ్ కలక్షన్స్ వచ్చాయి అనుకోవాలి. ఇది ఇలా ఉండగా నిన్న రాత్రి చిరంజీవి నిర్వహిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకు వచ్చిన మెగా వీరాభిమాని రవి చేసిన ఫీట్స్ ను చూసి ఏకంగా చిరంజీవి షాక్ అయ్యాడు.
చిరంజీవి నటించి బ్లాక్ బస్టర్ సినిమాలు 'పున్నమినాగు' 'ఆపద్భాందవుడు' 'ఠాగూర్' 'జగదేకవీరుడు అతిలోక సుందరి' 'ఖైదీ నెంబర్ 150' సినిమాలలో చిరంజీవి లుక్ అనుసరిస్తూ ఆయన డైలాగ్స్ ను కూడ మక్కీకి మక్కీగా అనుసరించి ఏకంగా మెగా స్టార్ నే ఆశ్చర్య పరిచాడు ఆ అభిమాని. దీనితో నిన్నటి కార్యక్రమాన్ని బుల్లితెర పై చూసిన ప్రేక్షకులు కూడ చాల జోష్ లోకి వెళ్ళిపోయారు.
ఇలా ఒక అభిమాని చిరంజీవి సినిమాలను అనుసరిస్తూ మరొక అభిమాని ఏకంగా చిరంజీవి ఇంకా షూటింగ్ ప్రారంభించని 'ఉయ్యాలవాడ' ఫస్ట్ లుక్ ను డిజైన్ చేసి హడావిడి చేస్తూ ఆరు పదులు దాటిపోయిన చిరంజీవి ఇప్పటికే కాదు ఎప్పటికీ మెగా స్టార్ చిరంజీవి మాత్రమే అన్న సంకేతాలు ఇస్తున్నారు..
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







