బహ్రెయిన్ ఫార్మర్స్ మార్కెట్ మళ్ళీ!
- May 04, 2017
బహ్రెయిన్ పార్మర్ మార్కెట్, తిరిగి సందడి చేయడానికి సిద్ధమయ్యింది. రమ్లి మాల్లో ఈ మార్కెట్ శనివారం అందరికీ అందుబాటులోకి రానుంది. బుడైయాలో ఐదో సీజన్ ముగించుకున్న ఫార్మర్స్ మార్కెట్ ఈసారి రమ్లి మాల్లో సందడి చేస్తుంది. రమ్లి మాల్, బహ్రెయిన్ ఫార్మర్స్ మార్కెట్ అలాగే అగ్రికల్చర్ మెరైన్ రిసోర్సెస్ సంయుక్తంగా ఈ మార్కెట్‌ని నిర్వహించనున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ కార్ పార్కింగ్ వద్ద ఏర్పాటు కానున్న ఈ మార్కెట్ ఉదయం 8 గంటల నుంచి ఐదు గంటలవరకు అందుబాటులో ఉంటుంది.తాజా కూరగాయలు, పళ్ళు మాత్రమే కాకుండా ఫుడ్ స్టాల్స్ విచ్చేసినవారికి చవులూరించే వంటకాల్ని అందిస్తాయి. లైవ్ కుకింగ్, లైవ్ బ్రెడ్ మేకింగ్ ఇక్కడి ప్య్రేకతలు. బహ్రెయినీ డైరీ ప్రోడక్ట్స్ మరో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఎగ్స్, బహ్రెయినీ డేట్స్తోపాటుగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఫార్మర్స్ మార్కెట్లో ఆర్గానిక్ ఉత్పత్తులు లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







