ప్రౌన్ మలై కర్రీ
- May 04, 2017
కావలసినవి: రొయ్యలు- 500గ్రా., కొబ్బరి పాలు - రెండు కప్పులు, పెద్ద ఉల్లిపాయ (మందంగా తరిగినది) - ఒకటి , మరో ఒక పెద్ద ఉల్లిపాయముద్ద మెత్తగా రుబ్బినది, అల్లం ముద్ద ఒక టీ స్పూన్, ఒకటిన్నర టీ స్పూన్ కారం, అర టీ స్పూను పసుపు, బిరంజి ఆకులు రెండు, లవంగాలు నాలుగు, యాలకులు మూడు, దాల్చిన చెక్క ఒకటి, ఒకటిన్నర టీ స్పూను పంచదార, రెండు టేబుల్ స్పూనులు నెయ్యి, పచ్చి మిరపకాయలు మూడు లేక నాలుగు(ముక్కలుగా తరిగినది) గుప్పెడు కొత్తిమీర తరిగినది అలంకరణ కోసం... ఉప్పు తగినంత.
తయారీ విధానం:
మందపాటి గిన్నెలో నెయ్యిని వేడి చేసి బిరంజి ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి అరనిమిషం వేగించండి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి అందులో అల్లం ముద్ద, కారం, పసుపు వేసి తిప్పండి. నెయ్యి పైకి తేలిన తరువాత అందులో రొయ్యలు వేసి రెండు నిమిషాలపాటు వేగించండి. తర్వాత కొబ్బరిపాలు, పంచదార, ఉప వేసి బాగా ఉడికించండి. రొయ్యలు ఉడికాయని అనిపించిన తరువాత మూత పెట్టి సన్నని సెగ మీద పది నిమిషాలు ఉంచండి. కొత్తిమీర, పచ్చిమిరపముక్కలతో అలంకరించి వేడి వేడి అన్నంతో తింటే ప్రాన్ మలై కర్రీ చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







