అమితాబ్ కు పాట రాసిన తెలుగోడు
- May 05, 2017
దక్షిణాది నుంచి హిందీ సినిమాల్లో పనిచేసే నటులుంటారు, సంగీత దర్శకులు ఉంటారు, దర్శకులు ఉంటారు. కానీ గీతరచయితల గురించి ఎప్పుడైనా విన్నామా? తొలిసారిగా తెలుగు సినీగీతరచయిత సిరాశ్రీ బాలీవుడ్ సినిమాకి పాట రాసారు. అది కూడా ఏకంగా అమితాబ్ బచ్చన్ సినిమాకి. రామ్ గోపాల్ వర్మ చాలా కాలం తర్వాత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న "సర్కార్-3" చిత్రానికి గాను సిరాశ్రీ "థాంబా.." అంటూ ఒక హిందీ పాట రాయడం జరిగింది.
"మొదటిసారిగా సర్కార్3 కోసం హిందీలో తెలుగు గీతరచయిత సిరాశ్రీ "థాంబా" అనే పాట రాసాడు". అని ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
దీనిపై సిరాశ్రీ స్పందిస్తూ, "తెలుగులో పాటలు రాసుకునే నేను హిందీ సినిమాకు పాట రాస్తానని కలలో కూడా కలగనలేదు. అది కూడా సాక్షాత్తు అమితాబ్ బచ్చన్ కి రాస్తానని అసలు ఊహలో కూడా ఊహించలేదు.ఆర్జీవి ఇక తెలుగులో సినిమాలు చెయ్యను అన్నారు. అది జరిగితే, ఇక ఆయనకు నాతో గీతరచయితగా జర్నీ ఆగిపోయినట్టే. అది జరగడం ఇష్టం లేదు. అందుకే ఇలా నా నుంచి హిందీపాట తన్నుకొచ్చింది అని నా ఫీలింగ్. "నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్" కదా! ఏళ్లతరబడి చూసిన హిందీ సినిమాలు, విన్న హిందీ పాటలు, కాలేజీ రోజుల్లో ఎన్సీసీ క్యాంపుల వల్ల పట్టుబడిన కొంత హిందీ, ఆర్జీవీ సాహచర్యం వల్ల పెరిగిన హిందీ మిత్రులు...ఇలా అన్ని విషయాలు నాకు తెలియకుండానే ఉపయోగపడ్డాయి." అని ఫేస్ బుక్కులో పోస్ట్ చేసాడు.
బాహుబలి2 తో రాజమౌళి, దాదాసాహెబ్ ఫాల్కేతో కే విశ్వనాథ్ తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయిలో జెండా ఎగరేస్తున్న తరుణంలో సిరాశ్రీ కూడా బాలీవుడ్ లో లో దక్షిణాది నుంచి కొత్త రికార్డు తెరవడం తెలుగు వారు గర్వించాల్సిన విషయమే.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







