‘ఒబామా కేర్’ స్థానంలో డోనాల్డ్ ట్రంప్ ‘రిపబ్లికన్ హెల్త్ కేర్’
- May 05, 2017
ఒబామాకేర్ను రద్దు చేయాలంటూ దిగువ సభ కాంగ్రెస్‌లో జరిగిన ఓటింగ్‌లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధించింది. ఒబామాకేర్ స్థానంలో ట్రంప్ ప్రభుత్వం రిపబ్లికన్ హెల్త్ కేర్ బిల్లును ప్రవేశపెట్టింది. ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను డెమోక్రాట్లు వ్యతిరేకించారు. ఒబామాకేర్ను రద్దు చేయడంవల్ల లక్షలాది మంది అమెరికన్లు ఆరోగ్య భీమా కోల్పోతారు అని డెమోక్రాట్లు ఆరోపించారు. దిగువసభలో ఆమోదం పొందిన బిల్లు ఇప్పుడు సెనెట్‌కు వెళుతుంది. అయితే సెనెట్‌లో బిల్లును మార్చి కొత్త చట్టాన్ని రూపొందించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. రిపబ్లికన్ హెల్త్‌కేర్ బిల్లు వల్ల పేదలు ఇన్సూరెన్స్ కోల్పోతారు అని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. కొన్ని హాస్పిటల్స్, కొంతమంది డాక్టర్లు కూడా రిపబ్లికన్ హెల్త్ కేర్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. 2010 లో ఏర్పాటు చేసిన ఒబామాకేర్ పథకం కింద రెండు కోట్ల మంది హెల్త్ ఇన్సూరెన్స్ పొందారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







