షార్జా సహారా సెంటర్ వద్ద అగ్నిమాపకదళ సిబ్బంది మంటను నింపారు
- May 05, 2017
సహారా సెంటర్లో ఈ రోజు మధ్యాహ్నం ( శుక్రవారం ) ఒక అగ్నిప్రమాదం జరిగింది. ఆ అగ్నిని 10 నిమిషాలలో అదుపులో ఉంచారు ఇది ఒక చిన్న అగ్ని ప్రమాదం ఐనప్పటికీ ఈ సెంటర్ ఖాళీ చేయడానికి వీలు లేని పరిస్థితి అక్కడ ఉంది.వేగంగా అలుముకొంటున్న పొగ కారణంగా భద్రత కల్పించటానికి ప్రభావితమైన ప్రాంగణాలు మరియు పొరుగు దుకాణాలను ఖాళీ చేయమని అగ్నిమాపక అధికారులు కోరారు.షార్జా సివిల్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్-కల్నల్ సాల్ అల్ నక్బి ఈ సందర్భంగా మాట్లాడుతూ , "ఇది ఒక చిన్న అగ్ని ప్రమాదమని ఇక్కడ ఎటువంటి మరణాల సంఖ్యనమోదు కాలేదని వివరించారు. సివిల్ డిఫెన్స్ ఆపరేషన్ రూమ్ కు అగ్ని ప్రమాదం గూర్చి ఈ రోజు మధ్యాహ్నం 1.00 గంటలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే అగ్నిమాపక దళ జట్టుని పారిశ్రామిక ప్రాంతంకు పంపడం జరిగింది. ఆ ప్రదేశంలో వంట గదిలోని ఓవెన్ మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ మంటలను 10 నిమిషాలలో తమ సిబ్బంది అదుపు చేసినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







