కశ్మీర్‌లో దారుణం పాక్.. సౌదీ ఛానళ్ల ప్రసారాలు
- May 05, 2017
జమ్మూకశ్మీర్‌లో పెరిగిపోతున్న ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టడానికి కంటి మీద కునుకు లేకుండా శ్రమిస్తున్న భద్రతా బలగాలకు మరో కొత్త సమస్య వచ్చి పడింది. రాష్ట్ర వ్యాప్తంగా భారత ప్రభుత్వం నిషేధించిన పలు పాకిస్థానీ.. సౌదీ అరేబియా టీవీ ఛానెళ్లు ప్రసారమవుతుండడం ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. దాదాపు 50 వరకు సౌదీ.. పాక్ ఛానెళ్లు నేరుగా ప్రసారం అవుతుండటం గమనార్హం. ఈ ఛానళ్లలో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో భారత్ వ్యతిరేక కార్యక్రమాలు ప్రసారం అవుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
ఇలా ప్రసారమవుతున్న ఛానళ్లలో వివాదాస్పద మత ప్రబోధకుడు జకీర్‌నాయక్‌కు చెందిన పీస్ టీవీ ఛానెల్ కూడా టెలికాస్ట్ అవుతున్నట్లు చెబుతున్నారు. శ్రీనగర్‌లో మొత్తం 50వేల ప్రైవేట్ కేబుల్‌కనెక్షన్లు ఉన్నాయని.. వీటన్నింటిలో పాక్.. సౌదీ టీవీ ఛానెళ్లు ప్రసారమవుతున్నాయని స్థానిక కేబుల్ ఆపరేటర్ వెల్లడించాడు. ఇలా ప్రసారమవుతున్న ఛానళ్లలో ఎక్కువగా ప్రభుత్వం నిషేధించిన ఛానెళ్లే ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఛానెళ్లలో ఉగ్రవాద సంస్థల ఫొటోలు.. వారికి సంబంధించిన వార్తలు ఎక్కువగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూకశ్మీర్‌లో సౌదీ.. పాక్ ఛానెళ్లు ప్రసారం కావడం తప్పేమీ కాదని వాటికి అనుమతి ఉందని శ్రీనగర్‌లోని అతిపెద్ద కేబుల్ నెట్‌వర్క్ అయిన సెన్(సైట్ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్) యాజమాని అమ్‌జద్ నూర్ చెబుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







