నిర్మాతగా మారుతున్న దర్శకుడు సుకుమార్
- May 05, 2017
లెక్కల మాస్టారు సుకుమార్ తీసిన రొమాంటిక్ డ్రామా... 100% లవ్. నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన ఈ సినిమా బ్రహ్మాండమైన హిట్ అయింది. కేవలం చదువు తప్ప మరేమీ తెలియని బాలు, అతడి మరదలి పాత్రలో తమన్నా చేసిన ఈ సినిమా ఇప్పుడు తమిళంలోకి రీమేక్ అవుతోంది. మరి తమిళ సినిమాలో సుకుమార్ పాత్ర ఏంటా అని చూస్తున్నారా.. పక్కా కాకినాడ కుర్రోడయిన ఆయన ఈ సినిమాకు దర్శకత్వం వహించట్లేదు.. నిర్మాతగా వ్యవహరిస్తున్నారట. చంద్రమౌళి తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ ఈ సినిమాలో లీడ్‌రోల్ పోషిస్తున్నాడు. ఈ వివరాలన్నింటినీ ప్రకాషే ట్వీట్ చేశాడు.
తెలుగు దర్శకుడు సుకుమార్ తన తదుపరి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చెప్పాడు. 100% లవ్ సినిమాను రీమేక్ చేస్తున్నారని, చెన్నై ఎక్స్‌ప్రెస్, దిల్‌వాలే లాంటి సినిమాలకు పనిచేసిన డూడ్లీ.. ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా ఉంటారని కూడా చెప్పాడు. మొత్తానికి ఇన్నాళ్లూ మెగాఫోన్ పట్టుకుని యాక్షన్.. కట్ చెప్పిన మన లెక్కల మాస్టారు నిర్మాతగా సరికొత్త పాత్రలోకి రంగప్రవేశం చేస్తున్నారన్న మాట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న విషయాన్ని మాత్రం ఇంకా జీవీ ప్రకాష్ చెప్పలేదు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







